FbTelugu

46 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువౌతుందే గానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. నేటికి ప్రపంచంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 46,21,082 కు చేరింది. కాగా వీరిలో 17,55,012 మంది కరోనా బారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు.

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 3,08,131 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. అయితే ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. యూఎస్ఏ లో నేటికి 14,83,961 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 88,484 మంది మృత్యువాత పడ్డారు.

You might also like