FbTelugu

కార్మికుల ఉసురు తీశారు: విజయసాయిరెడ్డి

అమరావతి: ఈఎస్ఐ స్కాంతో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కార్మికుల ఉసురు తీశారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ట్విట్టర్ వేదికగా మరోమారు విమర్శల వర్షం కురిపించారు. ‘‘వాళ్లంతా 20 వేల

లోపు జీతాలు పొందే కార్మికులు. ఈఎస్ఐ సభ్యత్వం కింద నెలకు రూ.50-70 చెల్లిస్తారు. అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటి. 900 కోట్ల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారు.’’అంటూ ట్వీట్ చేశారు.

You might also like