FbTelugu

వర్క్ ఫ్రం హోం పేరుతో రూ.60 లక్షలు లూటీ

హైదరాబాద్: నెటిజన్లు, జనాల బలహీనతలను ఆధారం చేసుకుని సైబర్ కేటుగాళ్లు డబ్బులు సునాయసంగా కొట్టేస్తున్నారు. వర్క్ ఫ్రొం హోమ్ కోసం దంపతులు గూగుల్ సెర్చింజన్ లో వెతికి సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కి రూ. 60 లక్షలు పోగొట్టుకున్నారు.
అమీర్ పేట కు చెందిన వంశీ మోహన్ దంపతులు గూగుల్ లో సెర్చ్ చేయగా ఒక లింక్ దొరికింది.

దానికి మెయిల్ చేయగా నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల కు వెళ్లింది. ఒక మొబైల్ లింక్ పంపించగా, ఆ లింక్ ద్వారా జాప్ బిట్ అనే ఏపికె ఫార్మాట్ లో ఉండే మొబైల్ యాప్ డౌన్ లోడు చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మూడు విడతల్లో మొత్తం రూ.60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అసలు విషయం తెలిసిన తరువాత వంశీ మోహన్ లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసాన్ని వివరించి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.