FbTelugu

ఒక‌వైపు చూస్తే బాక్సులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

బాక్సాఫీసు వ‌ద్ద ఇద్ద‌రూ మాస్ కింగ్‌లు. మూడున్న‌ర ద‌శాబ్దాలుగా వెండితెర‌పై కోట్లాది మంది అభిమానులున్నారు. పైకి భుజాల మీద చేతులు వేసుకున్నా.. లోలోన తెలియ‌ని దూరం మాత్రం క‌నిపిస్తూనే ఉంటుంది.

బాల‌య్య వ‌ర్సెస్ చిరంజీవి సినిమా రిలీజ్ అంటే.. పండగే. అదే స‌మ‌యంలో ప‌ల్లెల్లో కులం, అభిమానం రెండు క‌ల‌బోసిన ర‌చ్చ‌. సంక్రాంతి, ద‌స‌రా పండుగ‌ల్లో ఇరు వ‌ర్గాలు కొట్టుకున్న సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అటువంటి క‌మ్మ వ‌ర్సెస్ కాపు మ‌ధ్య చంద్ర‌బాబు స‌యోధ్య కుదుర్చుదామ‌ని ప‌వ‌న్‌ను తీసుకొచ్చినా లాభ‌ప‌డింది మాత్రం చంద్ర‌బాబు మాత్ర‌మే అనేది కాపుల్లో బ‌ల‌ప‌డింది. అయితే.. ఇపుడెందుకీ సోదీ అనుకోవ‌చ్చు. బాల‌య్య వ‌ర్సెస్ చిరంజీవి కుటుంబాల మ‌ధ్య వార్ వెనుక కేవ‌లం సినీ పోటీమాత్ర‌మే కాదు. కుల‌ప‌ర‌మైన అంశాలు కూడా సున్నితంగా క‌నిపిస్తుంటాయి.

ఇటువంటి స‌మ‌యంలో బాల‌య్య‌.. చిరంజీవి అండ్ తెలంగాణ ప్ర‌భుత్వంపై మోపిన నింద బాగానే పేలింది. కేసీఆర్ ఎలాగూ ఎన్టీఆర్ అభిమాని కావ‌టంతో చూసీచూన‌ట్లు వ‌దిలేశాడు. చిరంజీవి ఎలాగూ తెగేదాకా లాగ‌డు కాబ‌ట్టి చూసీచూడ‌న‌ట్టుగా ఉన్నాడు. బాల‌కృష్ణ త‌నను లాక్‌డౌన్ స‌డ‌లింపు.. సినీ షూటింగ్‌ల‌కు ప్ర‌భుత్వ చ‌ర్చ‌ల‌కు పిల‌వ‌లేద‌న్నాడు. ప‌త్రిక‌లు చ‌దివాక తెలిసింద‌న్నాడు. అయినా అదో రియ‌ల్ ఎస్టేట్ డీల్ అంటూ ఆరోప‌ణ‌లు సంధించాడు. అంతే.. అలా పేలిన సినిమా బాంబు.. మున్ముందు ఇంకెంత‌టి దుమారం రేపుతుందో చూడాలి అన్న‌ట్టుగా ఉంది. టీడీపీ ఏపీలో అధికారంలో ఉన్న‌పుడే రాచుకున్న మంట . లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని పిలుస్తారా అంటే… అబ్బే.. ఎవ‌ర్నీ నెత్తిన పెట్టుకోను.. పిలువ‌నంటూ ముఖానే చెప్పేశాడు. ఆ త‌రువాత ఎన్టీఆర్ బ్ల‌డ్ బ్రీడ్ వేరంటూ.. చిరంజీవి రాజ‌కీయ‌పార్టీ ఫెయిల్యూర్‌పై నోరుజారాడు.

ఆ త‌రువాత ప‌వ‌న్ రంగ ప్ర‌వేశం.. చ‌ర‌ణ్ కూడా ఘాటుగా స‌మాధానం ఇవ్వ‌టం అన్నీ జ‌రిగాయి. అప్పుడంటే. కేంద్రంలో పెత్త‌నం.. రాష్ట్రంలో అధికారంతో క‌న్నుమిన్ను క‌న‌ప‌డ‌లేదాయె. ఇప్పుడు కూడా సినీ రంగంలో ప్ర‌ముఖుల్లో బాల‌య్య‌కూ చోటుంది. అది ఎవ‌రూ కాద‌న‌లేనిది. కానీ.. చిరంజీవి పెద్ద‌రికం తీసుకోవ‌టం ఎందుకో.. నంద‌మూరి అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అదంతా.. క‌మ్మ వ‌ర్సెస్ కాపు వ‌ర్గ పోరు అనేది బ‌య‌ట‌కు చెప్ప‌కున్నా వాస్త‌వం. అయినా.. ఇప్పుడు.. బాల‌య్య స్పీచ్‌లో భూములు పంచుకునేందుకు జ‌రిగిన మీటింగ్ అంటూ బాల‌య్య నోరు జార‌టం ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది. దీనిపై నాగ‌బాబు కూడా గ‌ట్టిగా కౌంట‌ర్ ఎటాక్ చేయ‌టం కూడా బాల‌య్య బాబు అభిమానుల‌ను కాసింత ఆవేశానికి గురిచేసింది. ఏమైనా.. అప్ప‌ట్లో అంటే.. న‌రేంద్ర‌మోదీపై విజ‌య‌వాడ‌లో హిందీలో తొడ‌కొట్టి క‌ల‌క‌లం సృష్టించాడు.

2018 తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లోనూ బుల్‌బుల్ అంటూ న‌వ్వులు పండించాడు. కొణిదెల నాగ‌బాబు కూడా త‌క్కువ వాడేం కాదు.. అప్పుడు బాల‌కృష్ణ అంటే క‌మెడియ‌న్ క‌దా అంటూ చిచ్చుపెట్టాడు. ఆ త‌రువాత గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ కితాబుచ్చి బుక్క‌య్యాడు. ఇప్పుడు బాల‌య్య కింగ్ కాదు.. హీరో మాత్ర‌మేనంటూ స్ప‌ష్టంచేశాడు. బాల‌య్య బాల‌య్యే.. నాగ‌బాబు నాగ‌బాబే.. ఇద్ద‌రూ ఎవ్వ‌రూ త‌గ్గ‌రు. అలాగ‌నీ.. ప్ర‌తీకారం తీర్చుకునేంత స‌త్తా ఉందా! అంటే అబ్బే.. ఇద్ద‌రూ పైకి గంబీరంగా క‌నిపించే సౌమ్యులు. కానీ ఇద్ద‌రూ క‌ల‌సి ఇప్పుడు పెట్టిన మంట ఎప్ప‌టికి చ‌ల్లారుతుందో చూడాల్సిందే

You might also like