FbTelugu

చెక్కవంతెన కూలి 20 మంది గల్లంతు

డిస్పూర్: అసోంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ నదిపై చెక్క వంతెన కూలి 20 మంది గల్లంతైనారు. ఈ ఘటన అసోంలోని మాజురియా జిల్లా శ్రీరాంపురియా గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఓ నాటు పడవ చెక్క వంతెన వద్ద ఆగిపోవడంతో దానిని తీసుకుందుకు పలువురు ప్రయత్నించారు. ఈ క్రమంలో వంతెనపై ఎక్కువ మంది గుమిగూడడంతో ఒక్కసారిగా చెక్క వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 మంది నదిలో గల్లంతయ్యారు. వీరిలో చాలా మందికి ఈత రాదని సమాచారం. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

You might also like