FbTelugu

మహిళా క్రికెట్ మీనీ లీగ్ తేదీలు ఖరారు

ముంబై: క్రికెట్ అభిమానులకు ఇప్పటికే ఐపీఎల్ ప్రీమియర్ పేరుతో వినోదాన్ని అందిస్తున్న బీసీసీఐ మహిళా ప్రేమికులను అనందింపచేసేందుకు క్రికెట్ మినీ లీగ్ తేదీలను ఖరారు చేసింది.

యూఏఈ వేదికగా నవంబర్ 4వ తేదీ నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనున్నదని బీసీసీఐ ప్రకటించిం. ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్నోవస్ టీములు తలపడనున్నాయి. ఈ జట్లకు హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన నాయకత్వం వహించనున్నారు. నాలుగు మ్యాచులతో సాగే ఈ లీగ్ లో భారత క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్, వెస్టిండిస్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. టీములు, సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
సూపర్నోవస్: కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, చామరి ఆటపట్టు, ప్రియా పునియా, అంజు పాటిల్, రాధా యాదవ్, తానియా భాటియా, శశికళ శిరివర్ధనే, పూనమ్ యాదవ్, షకీరా, అరుంధతి, పూజ, ఆయుషి సోని, అంబోంగా, ముస్కాన్ మాలిక్,
ట్రైల్ బ్లేజర్స్: కెప్టెక్ స్మృతి మంధాన, దీప్తి శర్మ, పునమ్, రీచా, హేమలత, పర్వేన్, రాజేశ్వరి, హర్లీన్, జులన్ గోస్వామి, సిమరన్, సల్మా సోఫి, చాంతమ్ డాటిన్ కస్వీ గౌతమ్
వెలాసిటీ: కెప్టెన్ మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, షెఫాలి వర్మ, సుష్మ వర్మ, ఎక్తా, మున్సీ జోషి, శిఖా పాండే, దేవిక, సుశ్రీ, మనాలా దక్షిణి, కసపెరెక్, డేనియల్ వైట్, సునీ లూస్, జహానార అలమ్, అంగా.

You might also like

Leave A Reply

Your email address will not be published.