FbTelugu

మహిళలను వివస్త్రలను చేసి ఊరేగింపు

లక్నో: చిన్న పిల్లలను ఎత్తుకు వెళ్లే ముఠా గా భావించిన గ్రామస్థులు ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి గ్రామంలో ఊరేగించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై రాళ్లు రువ్వి దాడికి దిగారు.

ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలోని అశోక్ విహార్ లో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో ఇవాళ ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. చిన్నారులను ఎత్తుకువెళ్లేందుకు మహిళలు సంచరిస్తున్నారంటూ గ్రామంలో దావాణంలా వ్యాపించింది. వెంటనే మహిళలు, యువకులు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారంటూ వారిపై ప్రశ్నలు సంధించారు. భయాందోళనకు గురైన మహిళలు సమాధానం చెప్పడంలో తటపటాయించడంతో చిన్నారులను అపహరించే ముఠా అనే నిర్థారణకు వచ్చారు. వారిని వివస్త్రలు చేసి కొట్టుకుంటూ గ్రామంలో పరుగెత్తించారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు హుటాహుటిన గ్రామం చేరుకుని ప్రజలకు సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. వదిలి పెట్టాలని కోరగా పోలీసులపై తిరగబడి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. వారిని తీసుకువెళ్తున్న పోలీసు వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.