FbTelugu

మహిళలు సవాల్ గా తీసుకోవాలి: తమిళిసై

/Women-should-be-taken-as-a-challenge-says--Tamilisai

హైదరాబాద్: మహిళలు ప్రతి రంగాన్ని సవాల్ గా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ముషీరాబాద్ లో జాగృతి ఫౌండేషన్ నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగులో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఆమె… మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మహిళలు ప్రతి రంగాన్ని సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు తమకు నచ్చిన ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో నైపుణ్యతను సాధించాలని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ చూపాలన్నారు.

You might also like