FbTelugu

చీరలతో ప్రాణాలు కాపాడిన మహిళలు

చెన్నై: ఒంటిపై ఉన్న చీరలను తాళ్లుగా మలిచి నీటిలో మునిగిపోతున్న ఇద్దరి యువకుల ప్రాణాలను కాపాడారు మహిళలు. ఈ ఘటన పెరంబలూర్ జిల్లా కొట్టరాయ్ సమీపంలోని సిరవచ్చుర్ చెరువులో జరిగింది.

సుమారు 12 మంది యువకులు చెరువు పక్కన క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆట అయిన తరువాత చెరువు వద్దకు చేరుకున్నారు. మహిళలు బట్టలు ఉతికి ఆరేసి వెళ్తున్న సందర్భంలో వారితో యువకులు సంభాషించారు. చెరువులో స్నానం చేయోచ్చా అని అడగ్గా, నీరు ఎక్కువగా ఉంది, ప్రమాదమని చెప్పారు. ఈలోపే ఇద్దరు కాలు జారి అందులో పడిపోయారు. వారిని కాపాడేందుకు మరో ఇద్దరు దూకారు. నలుగురు ఈత రాక రక్షించండి అంటూ అరిచారు.

అక్కడే ఉండి చూస్తున్న మహిళలు ఏమాత్రం తమ మానాన్ని సైతం లెక్క చేయకుండా ఒంటిపై ఉన్న చీరలను విప్పేశారు. వాటిని తాళ్లుగా మలిచి చెరువులోకి విసిరారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరో ఇద్దరు చనిపోయారు. మహిళలు ఏమాత్రం పట్టించుకోకపోయినా ఇద్దరి ప్రాణాలు దక్కేవి కావని గ్రామస్థులు కితాబునిస్తున్నారు.

You might also like