FbTelugu

జాబ్ ఇవ్వాలంటూ.. సెల్ టవర్ ఎక్కిన మహిళలు

women-climbing-the-cell-tower-for-jobs

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ.. కొందరు నిరుద్యోగ మహిళలు సెల్ టవర్ ఎక్కిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కొందరు బీఎస్సీ, బీజడ్ సీ నిరుద్యోగ మహిళలు తమకు కూడా గ్రామ సచివాలయ జాబులు ఇవ్వాలంటూ.. ‘జగనన్నా జాబ్ ఇవ్వన్నా’ అంటూ నినాదాలు చేస్తూ.. సెల్ టవర్ ఎక్కారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంటనే స్పందించి తమతో మాట్లాడాలని వేడుకున్నారు. లేదంటే పెట్రోల్ పోసుకుంటాం అంటూ తమ నిరసన తెలుపుతున్నారు.

You might also like