FbTelugu

డీజీపీ ని కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

అమరావతి: మహిళలపై జరుగుతున్న దాడులపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన తరువాత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రలో మహిళలపై జరుగుతున్న కేసులపై డిజీపీ తో చర్చించామన్నారు. గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యిందన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. దిశా యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగుల పై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పద్మ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.