FbTelugu

పశువుల వ్యాపారి దాడిలో గాయపడ్డ…

మెదక్: అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్ వద్ద వితంతువు మహిళ పై పశువుల వ్యాపారి సాజిద్ పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటనలో ఆ మహిళ ఇవాళ ప్రాణాలు విడిచింది.
చక్రిబాయ్ 80 శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 3 గంటలకు మృతి చెందింది.

పశువుల వ్యాపారి సాజిద్ ను బాకీ డబ్బులు ఇవ్వాలని చక్రి బాయ్ కొద్ది రోజులుగా అడుగుతున్నందుకే ఈ ఘాతుకం జరిగిందని అల్లాదుర్గం పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పశువుల వ్యాపారి సాజిద్ ను అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.