FbTelugu

మహిళ అసహజ శృంగారం… భర్త ఆత్మహత్య…

Woman-Unnatural-Romance-Husband-Suicide

రెండు అంతస్థుల భవనం పై నుంచి బలవన్మరణం

ఒంగోలు: ఆమె మహిళే అయినా… సెక్స్ టాయ్స్ తెప్పించుకుని అమ్మాయిలతో శృంగారం చేసేది. ఇలా కొన్ని నెలలుగా సాగుతున్న అసహజ శృంగారానికి ఒక అమ్మాయి సమ్మతించలేదు. నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం… విచారణలో విస్తుగోల్పేలా సెక్స్ టాయ్స్ కన్పించడంతో మహిళ భర్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. నలుగురిలో నా పరువు పోయిందంటూ అవమాన భారంతో రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స కోసం ఆసుపత్రి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. మహిళలే సిగ్గుపడేలా చేసిన ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు లోని మారుతినగర్ లో చోటు చేసుకున్నది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు మారుతీ నగర్​లోని ఒక ఇంట్లో రెండో అంతస్తులో ఏడుకొండలు, సుమలత దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. ఏడుకొండలు ఆటోలు నడుపుతూ, సాయంత్రం పూట నూడిల్స్ బండి ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుమలత గృహిణిగా ఉంటూ భర్తకు లేని సమస్యలు తెచ్చిపెట్టింది. ఇంటి సమీపంలో ఉండే కాలేజీ అమ్మాయిలను పరిచయం చేసుకుని, వారికి డబ్బులు ఇచ్చి లోబర్చుకునేది. ఆన్ లైన్ షాపింగ్ లో సెక్స్ బొమ్మలను ఖరీదు చేస్తుండేది. మగవాడి వేషం ధరించి, సెక్స్ టాయ్స్ తో అమ్మాయిలతో విశృంఖల శృంగారం చేస్తుండేది. సుమలత అసహజ శృంగారాన్ని భరించలేని జరుగుమల్లికి చెందిన ఒక అమ్మాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సుమలత నిఘా పెట్టారు. మారుతీ నగర్​లోని ఆమె ఇంటికి వెళ్లి విచారించగా విస్తుగొలిపే విధంగా వస్తువులు బయటపడ్డాయి. భర్త ఏడుకొండలు సమక్షంలోనే ఇంట్లో సోదాలు చేయగా సెక్స్ టాయ్స్ కనిపించాయి. పోలీసులు వెళ్లిపోయిన తరువాత భార్యను తీవ్రంగా మందలించాడు. అయినా అవమాన భారం భరించలేని భర్త ఏడుకొండలు రెండో అంతస్థులోంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న ఆయనను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుకొండలు చనిపోయాడు. ఈ ఘటనకు కారణమైన భార్య సుమలతపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

You might also like