FbTelugu

తన భర్త ఎక్కడంటూ.. కేటీఆర్ కు మహిళ ట్వీట్

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త ఎక్కడంటూ ఓ మహిళ.. మంత్రి కేటీఆర్ కు ట్వీట్ పెట్టింది. ఈ పోస్ట్ పై గాంధీ సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో ఆ మహిళ భర్త చనిపోయాడని విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఈ నెల 1న ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే కరోనాతో మృతి చెందినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు చెప్పే మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. దానికి సంబంధించి తమ వద్ద రికార్డు్ల్లో కుటుంబ సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయని తెలిపారు. కరోనాతో మృతి చెందితే పోలీసులకు అప్పజెప్పడం తమ బాధ్యత అని తెలిపారు.

You might also like