FbTelugu

మహిళ గొంతుకోసి దారుణ హత్య

నిజామాబాద్ : మహిళను గొంతుకోసి, చేయి నరికి అతి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాముల బస్తీకి చెందిన శైలజ అనే మహిళను కొందరు గుర్తు తెలియని దుండగులు స్థానిక ఆస్పత్రి మార్చూరీ దగ్గర అతి దారుణంగా గొంతు కోసి, ఓ చేయి నరికేసి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.