FbTelugu

చిన్న చేప వెనకాల తిమింగలాలు: అనిత

విశాఖపట్నం: వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వి.విజయసాయి రెడ్డి ముఖ్య అనుచరుడు కొయ్య ప్రసాద రెడ్డి అనే చిన్న చేప వెనక పెద్ద తిమింగలాలు ఉన్నాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

విశాఖపట్నంలో విలువైన వంద ఎకరాల భూమి కబ్జా చేసేందుకు ప్రసాద రెడ్డి ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నది. సీఎం వైఎస్.జగన్, ఎంపీ వి.విజయసాయి రెడ్డిల ప్రోద్బలంతో విశాఖలో వేలాది ఎకరాలు కబ్జా చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ భూ కబ్జాపై రిటైర్డు జడ్జీతో విచారణ చేపట్టాలని అనిత డిమాండ్ చేశారు.
ప్రసాద రెడ్డి అనే వ్యక్తి చిన్న చేప మాత్రమేనని, ఆయనను విచారిస్తే తిమింగలాలు బయటకు వస్తాయన్నారు. రాజధాని ముసుగులో విశాఖలో భూములను లాగేసుకుంటున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు.

You might also like