FbTelugu

రెవెన్యూ నిరసనలో మహిళ ఆక్రోషం

Woman-outraged-at-revenue-employees-protests

యాదాద్రి: అబ్దుల్లాపూర్ మెట్ మండల తహశీల్దార్ విజయారెడ్డి హత్యను వ్యతిరేకిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసనపై ఒక మహిళ ఆక్రోషం వ్యక్తం చేసింది. అధికారులపై దాడులను వ్యతిరేకిస్తూ ఇవ్వాళ గుండాల మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఓ పనిచేయడం లేదని, తాను లంచంగా ఇచ్చిన రూ.2 వేలు వెనక్కి ఇవ్వాలంటూ ఒక మహిళ నిలదీయడంతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. ఇవ్వాళ రూ.2వేలు ఖర్చు చేసి ఇక్కడ పనికోసం వచ్చానని, మీరు నిరసనలో ఉన్నారా అంటూ మరొకరు మండిపడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన గుండాల రెవెన్యూ సిబ్బంది నిరసన నుంచి నెమ్మదిగా జారుకున్నారు.

You might also like