FbTelugu

కూతురు కోసం వచ్చాడని గొంతుకోసి హత్య!

ఓ యువకుడు ప్రేమ పేరుతో తమ కూతురికోసం తరుచూ వస్తూ పరువు తీస్తున్నాడంటూ యువకున్ని అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చిదంబరం గ్రామానికి చెందిన యువకుడు(21), ఓ యువతి ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా వారు కలుసుకోడం ఇబ్బందిగా మారింది.

దీంతో తరచూ యువతి ఇంటికి వచ్చేవాడు. ఇది గమనించిన యువతి తల్లిదండ్రులు తమ పరువు పోతుందని యువకునికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా యువకుడు అలాగే వస్తుండడంతో అతన్ని బందించి గొంతుకోసి హతమార్చారు. పరువు పోతుందని తామే హత్య చేసినట్టుగా లెటర్ కూడా రాసిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like