FbTelugu

మహిళ చుంబనం… పోలీసు సస్పెండ్!

లిమా: జరిమానా నుంచి తప్పించుకునేందుకు ఒక మహిళ వేసిన ఎత్తుకు పోలీసు అధికారి చిత్తయి సస్పెండ్ కాక తప్పలేదు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి బదనాం అయ్యాడు.
కరోనా నియంత్రణలోకి రాకపోవడంతో పేరూ దేశం లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన ఒక మహిళ పేరు రాజధాని లిమాలో తిరిగింది. ఆమెను పోలీసు అధికారి అడ్డగించి ఆపేశాడు. నిబంధనలకు విరుద్దంగా బయటకు ఎలా వచ్చావంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానా వేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ విషయాన్ని గమనించిన ఆమె అతడికి దగ్గరగా వెళ్లింది. జరిమానా బదులు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా అతను తొలుత నిరాకరించాడు. ఒత్తిడి చేయడంతో మనసు మార్చుకున్న పోలీసు అధికారి మాస్క్ తీసి ముద్ద పెట్టించుకుని మురిసిపోయాడు. వీరిద్దరూ గాఢంగా ముద్దుపెట్టుకుంటున్నది సీసీటీవీలో రికార్డు అయింది. వీడియో వైరల్ అయి లిమా మేయర్ లుయిస్ మెలినా దృష్టికి వెళ్లింది.
జరిమానా వేయకుండా మాస్క్ తీసి ముద్దు పెట్టించుకోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అధికారిని వెంటనే సస్పెన్షన్ చేయాలని మేయర్ ఆదేశించారు. పేరూ దేశంలో కేసులు ఎక్కువగా నమోదు కావడంతో లాక్ డౌన్ లో కఠిన ఆంక్షలు అమలుపరుస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.