FbTelugu

అంబులెన్స్ సిబ్బంది వాగ్వాదం.. మహిళ మృతి!

శ్రీకాకుళం: అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలోని ఇచ్చాపురం మండలం, ముచ్చింద్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ మహిళ పాము కాటుకు గురి కావడంతో ఇచ్చాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి సిబ్బంది రిమ్స్ కు రిఫర్ చేశారు.

దీంతో మహిళ బంధువులు అంబులెన్స్ కి ఫోన్ చేయడంతో అక్కడికి రెండు 108 అంబులెన్సులు అక్కడికి వచ్చాయి. రెండు అంబులెన్సుల సిబ్బంది మధ్య సుమారు గంట పాటూ వాగ్వాదం జరిగింది. దీంతో అప్పటికే పరిస్థితి విషమంగా ఉన్న ఆ మహిళ మృతి చెందిందని మృతురాలి బందువులు ఆరోపించారు.

You might also like