FbTelugu

పెంచుకున్న పాము చేతిలో మహిళ మృతి

Woman-killed-at-the-hands-of-an-inflated-snake

వాషింగ్టన్: ఇంట్లో పాములను పెంచుతున్న ఓ మహిళ జీవితం విషాదాంతమైంది. తాను ప్రేమగా పెంచుకున్న కొండచిలువ మెడకు చుట్టుకోవడంతో ఆమె దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు..లారా హర్ట్‌(36) అనే మహిళ ఇండియానాలోని ఆక్స్‌ఫర్డ్ లో నివసిస్తోంది. పాములంటే మక్కువ కలిగిన లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. వీటిలో ఎనిమిది అడుగుల కొండచిలువ కూడా ఉంది. కాగా బుధవారం లారా ఆకస్మికంగా మృతి చెందినట్లు పొరుగింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారా ఇంటికి వచ్చి ఆమె శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారా ఇంటిని వెదకగా వందల సంఖ్యలో పాములు వాళ్ల కంటపడ్డాయి.

You might also like