FbTelugu

రూ.48 కోట్ల ఆశ చూపి.. మహిళ వద్ద రూ.23 లక్షలకు టోపీ

హౌదరాబాద్: రోజు రోజుకి రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజగా చారిటీ పేరుతో సైబర్ నేరగాళ్లు 6,52,000 డాలర్లు (సుమారు రూ.48 కోట్లు) ఇస్తామంటూ ఆశ చూపి ఓ మహిళ వద్ద ఏకంగా రూ.23 లక్షలకు టోపీ వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రశాంతి అనే ఓ మహిళకు సోషల్‌మీడియాలో ఓ విదేశీ వ్యక్తి పరిచయమైనాడు. అతడు భారత్ లో చారిటీ ఏర్పాటు కోసం 6,52,000 అమెరికా డాలర్లు పంపించానంటూ తెలిపాడు.

వాటిని పొందాలంటే పలు రకాల ట్యాక్సులు కట్టాలంటూ సదరు మహిళ నుంచి ఏకంగా రూ.23 లక్షలు పలు మార్లు వివిద అకౌంట్లలో వేయించుకున్నాడు. ఎంతకీ చారిటీ డబ్బు రాకపోవడంతో.. తాను మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులను గుర్తించారు. నైజీరియాకు చెందిన నియిబిజి ఎగ్డే అనే వ్యక్తి ఈ తతంగాన్ని మొత్తం పలువురి సాయంతో నడిపినట్టుగా గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.