FbTelugu

నడి రోడ్డుపై మహిళ ధర్నా..

Woman-Dharna-on-Road

తూర్పుగోదావరి: తనను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ రోడ్డు ధర్నాకు దిగిన ఘటన జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మాజీ ఎంపీటీసీ కంచబోయిన సంధ్య అనే వివాహిత తన భర్త శ్రీను వేరోక మహిళతో అక్రమ సంబంధం పెట్టకుని తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది. రోజూ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని ఇద్దరు కుమారులతో తన జీవితం నెట్టుకు రావడం కష్టంగా ఉందని తెలిపింది. తనకు న్యాయంకోసం ఈ ధర్నాకు దిగినట్టు తెలిపింది.

You might also like