FbTelugu

ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య!

హైదరాబాద్: అదేపనిగా ఫోన్ వాడుతూ.. ఫోన్ కు బానిసైన కూతుర్ని తల్లి మందలించినందుకు ఓ బాలిక(17) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక అదేపనిగా

ముబైల్ ఫోన్ ను వాడుతూ ఉండడంతో.. ఆ బాలిక తల్లి మందలించి ఫోన్ వాడొద్దని తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like