FbTelugu

కాంగ్రెస్ ఎమ్మెల్యే బంగ్లాలో మహిళ ఆత్మహత్య

భోపాల్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నివాసం ఉంటున్న బంగ్లా లో ఆయనకు సన్నిహితంగా ఉన్న మహిళ సోనియా భరద్వాజ్ (38) ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆమె రాసిన ఆత్మహత్య లేఖలో ఎమ్మెల్యే పేరు రాసి ఉండడంతో ఉత్కంఠ రేపుతోంది.

గాంధ్వాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమాంగ్ సింగార్ అధికారిక బంగ్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్న సోనియా భరద్వాజ్ నుంచి పోలీసులు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉమాంగ్ సింగార్ జీవితంలో స్థానాన్ని కోరుకున్నానని, అది సాధ్యం కాకపోవడంతో బతకడం ఇష్టం లేకే బలవన్మరణం చెందుతున్నట్లు లేఖలో పేర్కొన్నది. ఆమె ఆత్మహత్యపై ఎమ్మెల్యే ఉమాంగ్ స్పందించారు. ఆమె నాకు మంచి మిత్రురాలు. ఆత్మహత్య విషయం తెలిసిన తరువాత నా గుండె పగిలిపోయిందని, ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టిందో అర్థం కావడం లేదని తెలిపారు. స్థానిక ఎస్పి రాజేశ్ సింగ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బంగ్లా లో సర్వెంట్, ఆయన భార్య నివాసం ఉంటారు. ఆదివారం ఉదయం సర్వెంట్ భార్య, సోనియా పడుకున్న గది తలుపు తట్టగా ఎలాంటి అలికిడి రాలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఉమాంగ్ కు తెలిపారు. వారు వచ్చి చూడగా ఆ మహిళ ఫ్యాన్ కు ఉరేసుకుని కన్పించిందని ఎస్పి రాజేశ్ తెలిపారు. సోనియా భరద్వాజ్ స్వస్థలం హర్యానా రాష్ట్రం అంబాలాలోని బల్ దేవ్ నగర్ అని తెలిపారు. ఆమె భర్త సంజీవ్ అంబాలాలో నివసిస్తారని, 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడన్నారు. గత ఇరవై ఐదు రోజులుగా ఎమ్మెల్యే క్వార్టర్ లో సోనియా ఉంటున్నదని ఎస్పీ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.