FbTelugu

నిద్రలోనే లేచి నడిచాడు… చనిపోయాడు

ముంబయి: నూటికో కోటికో ఒక్కరికి అరుదైన వ్యాధులు, అలవాట్లు ఉంటాయి. అవే వారి పాలిట శాపంగా మారతాయి. నిద్రలో నడిచే అలవాటు ఉన్న వ్యక్తిని అదే ప్రాణం తీసింది.

కలినా ప్రాంతానికి చెందిన వజ్రాల కార్మికుడు ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసి ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 3 గంటల ప్రాంతంలో నిద్రలోంచి పైకి లేచి నడవడం మొదలు పెట్టాడు. నిద్రలోనే ఇళ్లంతా అటు ఇటూ తిరిగాడు. తన ప్రమేయం లేకుండానే కిటికీ తెరిచి కిందకు పడిపోయాడు. నాలుగు అంతస్తలు పై నుంచి పడిపోయిన అతని అరుపులు కేకలు విని ఇరుగు పొరుగువారు నిద్రనుంచి మేల్కొన్నారు. బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి కొట్టుకుని చనిపోయాడు.
అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఆసక్తికరమైన విషయాలు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నెలలో ఒకసారి లేదా రెండుసార్లు రాత్రి పడుకున్న తరువాత లేచి నడుస్తాడన్నారు. ఇంటి ఆవరణలోనే అటు ఇటూ తిరుగుతాడని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.