FbTelugu

కోడిపందాలకు ఇద్దరు మృతి !

సంక్రాంతి సమీపిస్తున్న వేళ కోడి పందాలకు కోడిపుంజులను సిద్ధం చేస్తుండగా.. కోడి పందాలను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న పోలీసులు, తాజాగా జరిపిన దాడులు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చీరాల మండలం విజయనగర్ కాలనీ శివార్లలో కోడి పందాల స్థావరాలున్నాయని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసిన నిర్వాహకుల్లో ముగ్గురు పారిపోయే క్రమంలో సమీపంలోని కాలువలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. వారిని మధు, శ్రీనుగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like