FbTelugu

రైతు ఉద్యమానికి రాం రాం చెప్పిన రెండు సంఘాలు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని నగరంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ లో అసాంఘిక శక్తుల ప్రవేశంతో అదుపు తప్పి అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సాకుగా చూపి కొన్ని సంఘాలు బయటకు వచ్చాయి.

ఈ ఆందోళణల నుంచి తప్పుకుంటున్నట్లు రెండు సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు అధికారికంగా ఇవాళ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలు బాధించాయని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ నాయకుడు వీఎం.సింగ్ తెలిపారు. నిర్ణీత సమయం కంటే ముందే ర్యాలీ ప్రారంభించడం మూలగా అల్లర్లు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించామని ఆయన ప్రశ్నించారు. ఎర్రకోట పై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్వాగఫలమని సింగ్ అన్నారు. ఈ ఆందోళన నుంచి తాము కూడా తప్పుకుంటున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. నిన్నటి ఘటనలు బాధిస్తున్నాయని ఆయన తెలిపారు. అధికార బీజేపీ ప్రభుత్వం అనుకున్నట్లు గానే రైతు సంఘాల సమాఖ్యలో చీలిక రావడం జరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.