FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 22,771 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 22,771 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 442 మంది మృత్యవాత పడ్డారు.

నేటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,48,315 కు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారి నుంచి కోలుకుని 3,94,227 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 2 లక్షల 35 వేల 433 కు చేరింది. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 18,655 మంది మృత్యువాత పడ్డారు.

You might also like