FbTelugu

5 నిమిషాల్లో రెండు డోసులు.. నింపాదిగా మహిళ!

పాట్నా: వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే ఆరోగ్య కేంద్రాలకు నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఒక మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు డోసులు ఇచ్చేశారు.

ఈ విషయం తెలిసిన గ్రామస్థులు వ్యాక్సినేషన్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్ కు చెందిన సునీలా దేవి (63) వ్యాక్సిన్ వేయించుకునేందుకు కేంద్రానికి వెళ్లింది. కోవాగ్జిన్ కోసం ఒక కౌంటర్, కోవిషీల్డ్ కోసం మరో కౌంటర్ ఏర్పాటు చేసి వేర్వేరుగా క్యూ ఏర్పాటు చేశారు. తొలుత ఆమె ఒక లైన్లో నిల్చుని కోవాగ్జిన్ వేయించుకున్నది. మరోసారి వ్యాక్సిన్ ఇస్తారేమోనని అనుకున్న ఆమె రెండో క్యూ లైన్ లో వెళ్లి కోవిషీల్డ్ వేయించుకున్నది. నర్సులు కూడా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా వ్యాక్సిన్ ఇచ్చేసి పంపించారు. ఇంటికి వచ్చిన తరువాత రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సునీలా దేవి కుటుంబ సభ్యులకు తెలపగా షాకయ్యారు. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు డోసులు ఎలా తీసుకున్నవని ప్రశ్నించగా, వాళ్లు ఇచ్చారు, నేను తీసుకున్నాను అని నింపాదిగా సమాధానం చెప్పింది.

గాబరాపడిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు వ్యాక్సినేషన్ కేంద్రం ముందుకు వెళ్లి ఆందోళన చేశారు. జిల్లా ఆరోగ్య అధికారి తన సిబ్బందితో కలిసి సునీలా ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆమెను నర్సులు పర్యవేక్షిస్తున్నారు. దేశంలో ఫస్ట్ డోసు కోవాగ్జిన్ వేసుకున్నవారికి, సెకండ్ డోసు డోసు కోవిషీల్డ్ వేసుకోవచ్చా అనే కోరిక చాలా మందిలో ఉంది. వీరందరి కోరికను సునీలా దేవి తీర్చేసిందన్న మాట.

You might also like

Leave A Reply

Your email address will not be published.