న్యూఢిల్లీ: వలస కూలీలను 15 రోజుల్లో వారి వారి స్వస్థలాలకు చేర్చాలని ఆయా రాష్ట్రాలకు భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టు తన మధ్యంతర తీర్పును ఇచ్చింది.
రాష్టాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లడానికి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీలను తరలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయనే చెప్పవచ్చు.