FbTelugu

ప్రైవేటు హాస్పిటళ్లకు వ్యాక్సిన్లు బంద్

ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాను నిలిపివేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను వినియోగించుకోవచ్చని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన వ్యాక్సిన్లు తిరిగి సేకరించాలని డిఎంహెచ్ఓలను ఆదేశించారు. ఈ నిర్ణయం మూలంగా ప్రైవేటు హాస్పిటళ్లలో ఇక నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదముంది. ఇక నుంచి వారు నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.