FbTelugu

జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట!: విజయసాయిరెడ్డి

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా.. విమర్శల వర్షం కురిపించారు. ‘‘జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం.

అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా?’’ అంటూ ట్వీట్ చేశారు. ఏపీలో రాబడి లేకపోయినా సీఎం జగన్ 90 శాతం హామీలు నెరవేర్చారని అన్నారు.

You might also like