FbTelugu

బాబు ఫెయిల్యూర్ తోనే జగన్ గెలుపు: సుజనా విమర్శ

Winning-jagan-with-Babu-Failuresays-Sujana

ఢిల్లీ: అమరావతి రాజధానిగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఫెయిల్యూర్ అని బీజేపీ నాయకులు సుజనా చౌదరి విమర్శించారు. నోటిఫికేషన్ రానందునే మ్యాప్ లో అమరావతి లేదన్నారు. అమరావతి నోటిఫికేషన్ జారీ చేయించడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు తప్పులు చేశారన్నారు. అందుకే జనం ఆయనను పక్కన పెట్టారన్నారు. చంద్రబాబు తప్పుల మూలంగానే వైసీపీ అధికారంలోకి వచ్చిందనేది నా అభిప్రాయమన్నారు. వైసీపీ పాలన పై ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు.

రానున్న నాలుగైదు నెలల్లో సిమెంట్ బస్తా ధర రూ.20 పెరగనుందని, ఎందుకు పెరుగుతుందనేది తర్వాత చెప్తానన్నారు. ఏపీ సీఎస్ బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారికే ఇలాంటి పరిస్థితి రావడం దారుణం. రాచరిక జమానా కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం భావ్యం కాదు.5 నెలలుగా అనేకమంది అధికారులకు పోస్టింగ్ లు లేకుండా ఉంచారు. ఇసుక కొరత పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. రూ.300 కోట్ల వరకు మాత్రమే ఇసుక ద్వారా ఆదాయం వస్తుంది తప్ప అంతకు మించి వచ్చే అవకాశమే లేదు. వైసీపీ నేతలు ఎన్నికలు అయిపోయాయనే అంశాన్ని గుర్తిస్తే మంచిది. లిక్కర్ ధరలు పెరగడంతో సామాన్యుల పైనే భారం పడేది.

రివర్స్ టెండరింగ్ చేశారు కానీ పోలవరం అథారిటీ నుంచి అనుమతి లభించలేదు. గత ప్రభుత్వం లెక్కకు మించి శంకుస్థాపన లు చేసి ప్రాజెక్టుల నిర్మాణంలో కాలయాపన చేశారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగలంటూ రిజర్వేషన్లు తీసుకొచ్చారు ఇది రాజ్యాంగ విరుద్ధం. నూతన రిజర్వేషన్లు తీసుకొచ్చాక ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చింది.

You might also like