FbTelugu

కంటినిండా నిద్రపోతూ రూ.10 లక్షలు గెలుచుకోండి!

న్యూఢిల్లీ: ఎవరి ఇంట్లో అయినా తెల్లవారుతున్నా లేవకపోయినా, ఆలస్యంగా మేల్కొన్నా పెద్దవాళ్లతో తిట్లు తప్పవు. పొద్దెక్కుతున్నా ఇంకా పడుకున్నావా అంటూ పెద్దవాళ్లు మండిపడుతుంటారు. కంటి నిండా నిద్రపోండి, మేమిచ్చే బహుమానం పొందండి అంటూ ఒక కంపెనీ ప్రకటన ఇచ్చింది.

అదెంటో మనమే చూద్దాం. వంద రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోతే రూ.10 లక్షలు బహుమానంగా ఇస్తామని వేక్ ఫిట్ కంపెనీ వెల్లడించింది. అయితే మీరు చేయాల్సిందల్లా వేక్ ఫిట్ వారి బ్యాచ్ 2021-22 ఇంటర్న్ షిప్ లో పాల్గొనడమే మరి. కంటినిండా నిద్రపోతు కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ పోటీలో పాల్గొనాల్సిందే మరి. ఇక మీరు కూడా రెడే అవ్వండి. ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో బాగా నిద్రపోయే వారికి ఎంపిక చేస్తారు. ఎంపికైన ప్రతి ఒక్కరికి రూ.1 లక్ష నజరానా ఇస్తారు. ఈ పోటీలో గెలిచిన వారికి మాత్రం రూ.10 లక్షల బహుమానం సొంతమవుతుంది. సో ఇంటర్న్ షిప్ కోసం https://wakefit.co/sleepintern/ ను సందర్శించి మీ వివరాలు నమోదు చేసుకోండి.

You might also like

Leave A Reply

Your email address will not be published.