FbTelugu

యుపి సిఎం యోగిని మారుస్తారా?

లక్నో: మరి కొద్ది నెలల్లో యుపి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి అధినాయకత్వం ఇప్పటి నుంచి వ్యూహాలను పదునుపెడుతున్నది. దేశంలో అతిపెద్ద రాష్రం అయిన యుపిలో మరోసారి పాగా వేయడానికి ఇప్పటి నుంచే సర్వసన్నద్ధమవుతున్నది.

సిఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ మార్పు పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గడచిన 24 గంటల వ్యవధిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మాజీ కేంద్ర మంత్రి, అప్నాదళ్ పార్టీ ఎంపి అనుప్రియా పటేల్ గురువారం సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. యోగి ఢిల్లీ పర్యటనకు ముందుగా లక్నోలో అర్థరాత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శ సునీల్ బన్సాల్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం బన్సాల్ ప్రత్యేక హెలీకాఫ్టర్ లో హుటాహుటిన బుధవారం అర్థరాత్రి లక్నో చేరుకున్నారు. కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడు జితిన్ ప్రసాద బిజెపి తీర్థం పుచ్చుకోవడం కూడా మార్పులకు కారణంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున నాయకత్వ మార్పు గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. కరోనా ను నియంత్రించడంలో యోగి విఫలమయ్యారనే ప్రచారన్ని పార్టీలోని ప్రత్యర్థులు తెరమీదికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో యోగి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.