FbTelugu

విశాఖ స్టీల్ పై అసెంబ్లీలో తీర్మానం చేస్తా: జగన్

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక సంఘాలు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కోరాయి.
పెందుర్తి మండలం చినమూషివాడ శ్రీ శారదా పీఠం లో రాజశ్యామల యాగం చేసేందుకు జగన్ ఇవాళ విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆయనతో సమావేశమయ్యాయి. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశానని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు కేంద్రానికి పలు సూచనలు చేసినట్లు సీఎం చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.