FbTelugu

రెండు రోజుల్లో నిజాలు చెబుతా: ఎర్రకోట దీప్ సిద్ధూ

న్యూఢిల్లీ: పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే తనకు కొంత సమయం కావాలని ఎర్రకోటపై జెండా ఎగురవేసిన పంజాబీ నటుడు, బీజేపీ అభిమాని దీప్ సిద్ధూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆయన ఎక్కడ ఉన్నారనేది చెప్పకుండా వీడియోలను పోస్టు చేస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా ఎర్రకోటపై దీప్ సిద్దూ జెండా ఎగుర వేశారు. ఈ ఘటన పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనపై అరెస్టు వారెంట్ ఉందని, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారన్నారు. నాపై వదంతులు ప్రచారం చేస్తున్నారు, రెండు రోజుల్లో అన్ని బయటపెడతానని వీడియోల్ స్పష్టం చేశారు. అల్లర్లకు బాధ్యుడు దీప్ సిద్దూనే అని రైతు సంఘాలు కూడా ఆరోపించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.