FbTelugu

ఢిల్లీ గుండాలకు లొంగను: మమతా

కొలకతా: ఢిల్లీలో కూర్చున్న ఇద్దరు గుండాలకు లొంగే ప్రసక్తి లేదని, పశ్చిమ బెంగాల్ ను వారికి అప్పగించేది లేదని సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తను క్రీడాకారిణి కాదని కాని ఆడటం తెలుసునని ఆమె అన్నారు.

లోక సభలో తను ఉత్తమ క్రీడాకారిణి అనే విషయం వారు తెలుసుకోవాలన్నారు. దీనాజ్ పూర్ లో జరిగిన టిఎంసి ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విడగొడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా బెంగాల్ లో బిజెపి పప్పులు ఉడకవు అని అన్నారు. ఇవాళ ఆరో దశలో భాగంగా నాలుగు జిల్లాల్లోని 43 నియోకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది. ఈ నెల 29న మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తి కానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.