FbTelugu

మున్సిపల్ ఎన్నికలు మొదటికొస్తాయా?

అమరావతి: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు రీ నోటిఫై అయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కి అధికారం లేకపోవడంతో రీ నోటిఫై తప్పడం లేదు.
ఆరునెలలకు మించి స్ధానిక ఎన్నికలు వాయిదా పడితే రీ నోటిఫై చేయాల్సిందేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

ఆగిన చోట ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే రీ షెడ్యూల్‌ ఇచ్చారు. కరోనా కారణంగా వాయిదా పడినందున రీ నోటిఫికేషన్‌ అవసరం లేదంటున్నారు. ఇదిలా ఉండగా, మున్సిపల్‌ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే మళ్లీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.