FbTelugu

రామ్ చరణ్ తో కోలీవుడ్ బ్యూటీ జతకడుతుందా?

హీరో రామ్ చరణ్ తేజ, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్నది. అయితే ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ ఎవరనే దానిపై ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తున్నది.

బాలీవుడ్ హీరోయిన్లు కైరా అద్వానీ, అలియా భట్ పేర్లు విన్పించాయి. అయితే తాజాగా కోలీవుడ్ నటీమణి మాళవిక మోహనన్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. చరణ్ కు మాళవిక అయితేనే బాగుంటుందని శంకర్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో మాళవిక తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. 2013లో పత్తమ్ పోల్ మలయాళ చిత్రంలో తొలిసారి నటించింది. ఆ తరువాత హిందీ, తమిళ్, కన్నడ భాషా చిత్రాలలో నటించి మెప్పించింది. కొరియోగ్రాఫర్ కెయు.మోహనన్ కుమార్తె మాళిక మోహనన్.

You might also like

Leave A Reply

Your email address will not be published.