FbTelugu

కంగనా రనౌత్ విదేశాలకు వెళ్లదా?

ముంబయి: తనకు సంబంధం లేని ప్రతి అంశంలో జోక్యం చేసుకుంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ విమర్శలే ఇప్పుడు తనకు శాపంగా పరిణమించాయి.
తేజస్ సినిమా షూటింగ్ కోసం హంగేరిలోని బుడా పెస్ట్ కు వెళ్లాల్సి ఉన్నది. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు షెడ్యూలు ఖరారుచేశారు. వీసా కోసం ముంబయిలోని పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లింది. బాంద్రా పోలీసు స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదు అయింది.

నేర అభియోగాలపై విచారించేందుకు వివరాలను స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వివరాలు పంపించగా, బాంద్రా పోలీసు స్టేషన్ దేశ ద్రోహం కేసు ఉందని తెలిపారు. కేసు ఉన్నందున పాస్ పోర్టును పునరుద్దరించలేమని అధికారులు తేల్చి చెప్పడంతో చేసేది లేక కంగనా బిక్క మొహం వేసుకుని ఇంటిముఖం పట్టింది. నిబంధనల ప్రకారం ఆమె పాస్ పోర్టు గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీతో ముగియనున్నది. విదేశాల్లో షూటింగ్ కు వెళ్తున్నందున తన పాస్ పోర్టు ను రెన్యువల్ చేయాలని కంగనా ముంబయి హైకోర్టును ఆశ్రయించింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.