FbTelugu

కమల్ హాసన్ బిగ్ బాస్ లో కొనసాగేనా?!

దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ రియాల్టి షో ప్రసారమవుతున్నది. కరోనా కారణంగా నిలిపివేసినప్పటికీ మళ్లీ ప్రారంభించనున్నారు. నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆయన ఐదు బిగ్ బాస్ షో సీజన్ లు నిర్వహించేందుకు నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆరవ సీజన్ షో ఎవరు నిర్వహిస్తారనేదానిపై సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై కమల్ హాసన్ కాని అటు నిర్వాహాకులు కూడా పెదవి విప్పడం లేదు. ప్రస్తుతం కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయన గత ఆరు నెలలుగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల బాట పట్టాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.