FbTelugu

బీజేపీలోకి జానారెడ్డి?

హైదరాబాద్: కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా అంటూ అవుననే విధంగా అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
బీజేపీ పెద్దలతో చర్చించిన ఆయన, వారు షరతులకు అంగీకారం కూడా తెలిపారంటున్నారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్ నియోజవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డిని గెలిపించుకుని ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహరచన చేస్తున్నారు. తొలుత రఘువీర్ రెడ్డి బీజేపీలోకి చేరతాడని వార్తలొచ్చినప్పటికీ, పెద్ద నేతల రంగ ప్రవేశంతో జానా రెడ్డి మనసు మార్చుకున్నారు. నాగార్జున సాగర్ నుంచి కుమారుడు రఘువీర్ కాకుండా తానే రంగంలోకి దిగి అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.