FbTelugu

డిసెంబర్ లో కరోనాను అంతు తేలుస్తా: ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ ను అంతం చేసేందుకు మూడు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని, డిసెంబర్ నాటికల్లా వైరస్ భూతాన్నితరిమి కొడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

దేశంలో ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రెండోసారి నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫరేషన్ వార్ప్ స్పీడ్ కింద కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మహామహులైన శాస్త్రవేత్తను వ్యాక్సిన్ కోసం నియమించామన్నారు. శాస్త్రవేత్తల కృషితో డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసి కరోనాను పారిపోయేలా చేస్తామన్నారు.

అమెరికా దేశం కోసం గడచిన నాలుగేళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, రెండోసారి అధ్యక్ష పదవికి తన పేరు నామినేట్ చేయడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యర్థి, డెమెక్రాట్ అభ్యర్థి బిడెన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఆయన అమెరికాను రక్షించేవాడు కాదని, ప్రజల ఉద్యోగాలు పీకేవాడని ట్రంప ఆరోపించారు.

You might also like