FbTelugu

భర్త బాగోతాన్ని షేర్ చేసిన భార్య

భోపాల్: భర్త వేరే మహిళతో గడిపిన వీడియోలను స్వయంగా భార్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రచ్చరచ్చ అయ్యింది. పైగా ఇదేంటని నిలదీసిన బాధితురాలు, ఆమె కుమార్తెపై ఇద్దరు కలిసి భౌతిక దాడికి దిగారు.

భోపాల్ లో 2019 మే నెలలో ఒక వివాహిత (40) దుకాణానికి వెళ్లింది. యజమాని మత్తు మందు కలిపి ఇచ్చిన పండ్ల రసాన్ని సేవించింది. ఆ తరువాత దుకాణం యజమాని పలుమార్లు ఆమెతో గడిపి, వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి ఆమెను పలుసార్లు అనుభవించాడు. మొన్నటి వరకు ఈ వ్యవహారం కొనసాగింది. యజమాని భార్య ఒకరోజు భర్త స్మార్ట్ ఫోన్ చూడగా, ఈ వీడియోలు బయటపడ్డంతో ఆగ్రహానికి లోనయ్యింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాధితులు, ఆమె కుమార్తెలు ఆందోళనకు దిగారు. యజమాని ఇంటి ముందే ఆందోళనకు దిగగా, ఇద్దరు కలిసి దాడికి పాల్పడ్డారు. తల్లీ కుమార్తెల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.