FbTelugu

కూతురుతోనే వివాహం అన్నాడు… అందుకే చంపేసింది

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ముస్లిం మౌల్వి తన స్వంత కుమార్తెను మూడో వివాహం చేసుకునేందుకు భార్యను వేధించగా మర్మాంగాన్ని కోసేసి చంపేసింది. ఈ ఘటన ముజఫర్ నగర్ జిల్లాలో సంచలనం రేపుతోంది.

భౌరఖుర్ద్ గ్రామ మసీదులో మృతుడు మౌల్విగా పనిచేస్తున్నాడు. భౌరాకాలన్ పోలీసులు భార్యను విచారించగా వివరాలను పూసగుచ్చి చెప్పించింది. తన భర్తకు ఇద్దరు భార్యలు ఉండగా, తను రెండో భార్యనని చెప్పింది. తనకు ఐదుగురు కుమార్తెలు పుట్టారని చెప్పింది. మూడో పెళ్లి కోసం తరచూ హింసించేవాడని, ఒప్పుకోకపొవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. అది కూడా తన పెద్ద కుమార్తెనే చేసుకోవాలని వేధించేవాడని ఆమె చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. బుధవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో భర్తపై తనే దాడి చేసి, మర్మాంగాన్ని కోసి హత్యచేసినట్లు ఆమె అంగీకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.