FbTelugu

బోయిన్ పల్లి కేసులో ఎందుకింత గోప్యత?

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అసలు విషయాలు చెప్పకుండా కిడ్నాప్ గురించే వివరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
భూమి ఎవరిది, ఎన్నేళ్లుగా వివాదం నడుస్తోంది, ఈ కేసులో ప్రవీణ్ రావు ప్రమేయం ఎంత వరకు ఉందనే దానిపై అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం వెల్లడించడం లేదు. హఫీజ్ పేటలో 50 ఎకరాల భూమిని మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి దక్కించుకున్నారు. నాగిరెడ్డి మరణం తరువాత ఈ భూమి వ్యవహారాలను సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

అయితే సుబ్బారెడ్డి భూమి విషయంలో నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి అఖిలప్రియకు తెలియకుండా ప్రవీణ్ రావు తదితరులతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందంలో సుబ్బారెడ్డి భారీగా నగదు ముట్టింది. ఈ విషయం తెలియడంతో అఖిలప్రియ ప్రవీణ్ రావు పై మండిపడింది. మా భూమిని మీరెలా సెటిల్ మెంట్ చేసుకుంటారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు డబ్బులు చెల్లించాల్సిందేనని ఆమె పట్టుపట్టగా, నేను 2016లో కొనుగోలు చేశానంటూ ప్రవీణ్ రావు చెప్పే ప్రయత్నం చేశాడు. మీకన్నా ముందే మేము కొనుగోలు చేశాం, మాదేనంటూ అఖిల స్పష్టం చేసింది.

ఈ కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏవీ.సుబ్బారెడ్డిని ఏ2గా మార్చి, ఏ2గా ఉన్న అఖిల ను ఏ1గా, ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏ3గా మారుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుబ్బారెడ్డి దారిలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనేది అఖిల ప్రియ వాదనగా ఉంది. ఎందుకు ఈ భూ వివాదం మొదలైంది, ఆ భూమి ఎవరి కబ్జాలో ఉంది, ప్రవీణ్ రావు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఖాళీ తెల్ల కాగితాలపై సంతకం ఎందుకు చేశారనేది పోలీసులు కాని, ప్రభుత్వ అధికారులు కాని వివరించకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. అసలు డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయనేది కూడా వెల్లడించడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.