FbTelugu

ఆనందయ్యపై ఎందుకంత ఒత్తిడి?

నెల్లూరు: కరోనా బాధితులకు ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తూ కోలుకునే విధంగా చేస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య పై పాలకుల ఒత్తిడి పెరిగిందంటున్నారు. ఒక్క రూపాయి కూడా బాధితుల నుంచి తీసుకోకుండా చేస్తున్న వైద్యం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారు అక్కడకు వచ్చి నిమిషాల్లో సాధారణ మానిషి మాదిరి లేచి కూర్చుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారు మందు వాడి తగ్గించుకుంటున్నారు. ఈ ఫలితాలతో ఆయన పేరు ఏపి, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో మారు మోగుతున్నది. శాస్త్రీయత లేదనే సాకు చూపి ఏపి ప్రభుత్వం మందు పంపిణీ ఆపివేయించింది. జగన్ ప్రభుత్వ చర్యపై ప్రజలు భగ్గుమంటున్నారు. నయాపైస తీసుకోకుండా మందు పంపిణీ చేస్తుంటే, శాస్త్రీయత లేదని, నాటు మందు అని ప్రచారం చేయించడంపై మండిపడుతున్నారు. పైసా తీసుకోకుండా ఇవ్వడంతో ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది.

ఆయన ఉపయోగించే వాటిలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని రాష్ట్ర ఆయుష్ అధికారులు ఇప్పటికే తేల్చారు. ఐసిఎంఆర్ ఏం నివేదిక ఇస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. నాటు మందు అని ప్రచారం జరగడంతో ఆనందయ్య ఆయుష్ అధికారుల ముందే మందు తయారు చేసి చూపించారు. తయారు చేసే విధానాన్ని పరిశీలించి ఆయుష్ కమిషనర్ కర్నల్ రాము మందులో హానికర పదార్థాలు లేవని, వనమూలికలు ఉపయోగించారని తెలిపారు. శాస్త్రీయంగా ధృవీకరించే వరకు నాటు మందుగానే పరిగణిస్తామని ఆయన చెప్పడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.