FbTelugu

రెండో పెళ్లి నేనెందుకు చేసుకుంటాను: సురేఖవాణి

హైదరాబాద్: సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో సంబంధిత వ్యక్తులు, వ్యవస్థలకు ప్రమేయం లేకుండా వార్తలు పుట్టుకువస్తున్నాయి. వాటిని తెలుసుకుని స్పందించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది.

యాంకర్, నటి సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటున్నారని గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. యాంకర్ గా కేరీర్ ప్రారంభించిన ఆమె తరువాత పలు చిత్రాలలో నటించి పేరు సంపాదించుకున్నారు. త్వరలోనే ద్వితీయ వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కుమార్తె సుప్రీత సూచన ప్రకారమే వివాహం చేసుకుంటున్నారని ప్రచారం ప్రారంభించారు. ఆమె దృష్టికి గాసిప్ వార్తలు వెళ్లడంతో స్పందించక తప్పలేదు. అవన్నీ అవాస్తవాలు అని, రెండో వివాహం చేసుకోవడం లేదని సురేఖ్ స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగా సురేఖ భర్త రెండేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఈ మధ్య గాయని ఉపద్రష్ట సునీత రెండో వివాహం చేసుకోవడంతో సురేఖ పేరును తెరమీదికి తెచ్చి రచ్చరచ్చ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.